Wednesday, January 6, 2010

* క్షణం - అంతా తెలిసిపోయేనా

ప్రకృతి ఎలా మొదలైనది : ఎలా ఏర్పడినది ( ఇక్కడ వివరణ చాలా అవసరం : ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించండి ) -
క్షణం ఆ క్షణంలోనే జన్మిస్తూ మరల అదే క్షణంలోనే మరణిస్తుంది -
మరణించిన క్షణముననే మరల కొత్త క్షణం జన్మిస్తూ అదే క్షణంలోనే మరణిస్తున్నది -
క్షణం క్షణములుగా జన్మిస్తూ మరల అవే క్షణములలో మరణిస్తున్నాయి -
జన్మించిన క్షణములోనే మరణిస్తూ ఎన్నో క్షణములుగా యుగాలుగా సాగుతున్నాయి -
జన్మించిన తర్వాత మరణించడానికి కాల వ్యవధి క్షణమైనా మరణించిన తర్వాత జన్మించడానికి కాల వ్యవధి లేదు -
కొత్త క్షణం ప్రారంభానికి పాత క్షణం అనగా దాని ముందు క్షణం మరణం ఒకే సమయాన జరుగుతున్నది -
మరణిస్తున్నప్పుడే జన్మిస్తున్నది క్షణం కనుక మరణించిన ప్రతిసారి జన్మించడం ఖచ్చితం -
మొదటి క్షణం ఎప్పుడు జన్మించినదంటే మరణించిననాడే మొదటి క్షణం జన్మించినదని చెప్పగలను -
మరణించిననాడే మొదటి క్షణం జన్మించినదని చెప్పగా మరణానికి ముందు ఏది జన్మించినదంటే శూన్యం -
శూన్యమునకు కాలం లేదు శూన్యం జన్మతో మరణం అదే సృష్టికి మూల రహస్యం -
శూన్యమునకు ముందు ఏమిటి అంటే కాలమైనను భావమైనను ప్రదేశమైనను రూపమైనను ఏదైనను ఊహకు అందని మర్మము శూన్యమువలె -
మర్మమును మీకు తెలిపిన అర్థం కాదు తెలియుటకు అంతటి విశ్వ విజ్ఞానము ధ్యానభావము మీలో కలగదేమో -
పరమాత్మకు కూడా మర్మము మర్మముగానే ఉన్నదని దాని భావము అందుకే రహస్యము -
శూన్యం మరణించడంతో మొదటి క్షణం ఆరంభమై కాలముగా క్షణాలతో జన్మిస్తూ మరణిస్తున్నది -
శూన్యం జన్మించిన తర్వాత మరణించిన కాల వ్యవధి లేదు అనగా శూన్యం జన్మతో మరణమైనది -
కాలమునకు క్షణములు కూడా లేవు ఎందుకనగా క్షణములో ఎన్నో సూక్ష్మ క్షణాలు జన్మిస్తూ మరణిస్తున్నాయి శూన్యమువలె -
కొంత కాల వ్యవధిని గుర్తించుటకు మనం నిర్ణ ఇంచుకున్న తెలుసుకోగల సమయమే క్షణం -
శూన్యమునకు కాల వ్యవధి లేదు కనుక అదే మూలం ఆ స్థానమే పరమాత్మ దివ్య అమృత తత్వం -
శూన్య స్థానము నుండి కాలము ప్రారంభమై క్షణ క్షణానికి ఎన్నో ఏర్పడుతూ వస్తున్నాయి -
క్షణములతో మొదటగా ఏర్పడినది భావన ఆ భావనయే ఆలోచనను నిర్మించుకుంది -
ఆలోచనలలో గుణాలు మార్పుల విచక్షణ భావాలు ఉదయించి పరిశీలనమైన ఒక ఎరుక కల్గినది -
ఎరుకతో ఆలోచనలను భావాలతో అర్థం చేసుకుంటూ పరమాత్మ తత్వం పొందేవరకు సూక్ష్మంగా ఒదిగినది -
పరమాత్మ తత్వం పొందిన తర్వాత కాల వ్యవధి లేని ఒక క్షణాన ఎరుకను మరణింప జేసి మరల అదే క్షణాన శక్తిగా ఉదయించినది -
ప్రతి ఆలోచన ఎరుకతో భావిస్తూ సూక్ష్మ ప్రజ్ఞాన విజ్ఞానంతో పరమాత్మను స్మరిస్తూ కాంతి రూపాన్ని దాల్చినది -
పరమాత్మకు రూపం లేదు అది ఒక అమృత తత్వం ఆ తత్వాని పొందుటకు కాంతి(అణువంత) రూపంతో భావం ధ్యానిస్తున్నది -
ధ్యానం నుండే కాంతి రూపంతో ఒక ప్రదేశాన్ని నిర్మించి ఎన్నో భాగాలుగా విభజించి ఆలోచిస్తున్నది -
ప్రదేశాలను లోకాలుగా జగతిగా బ్రహ్మాండముగా ఊహకందని దివ్య లోకాలను ఎన్నింటినో సృష్టించింది -
లోకాలను క్రింద(లోపల) మధ్య పై(బయట) భాగాలుగా విడదీసి వాటి ప్రాముఖ్యతను నెలకొల్పింది -
ప్రతి లోకానికి సరియైన ప్రణాళిక దీర్ఘ కాలపు ఉపయోగము శ్రేష్టత భావన ఇల ఎన్నో ఆలోచిస్తూ సృష్టిస్తున్నది -
కాంతి రూపంతోనే ఏ లోకానికి కావలసిన రూపాలను ఆ లోకానికి తగ్గట్టుగా వాటి ప్రదేశాలను గుణస్థితిని కల్గిస్తున్నది - క్రింద భాగాన భూలోకం జల సర్ప మత్స్య లోకం మధ్య భాగాన వాయు మేఘ ప్రాణశక్తి ఆత్మ లోకం ఆకాశపొరలుగా ఉన్నవి -
పై భాగంలో విశ్వ సువర్ణ సూర్యచంద్ర లోకం ఇలా ఎన్నెన్నో దిక్కులు తోచనివిధంగా ఉన్నాయి -
అన్నిటికంటే విశిష్టమైనది విశ్వలోకం ఇందులో కాంతి నక్షత్రాలు పాలపుంతలు గ్రహాలూ ఎన్నో అనేకమై ఉన్నాయి -
పై భాగపు అంచున మహోత్తరమైన లోకాలు కలవు అవి కాంతి స్వభావ ఆలోచన శూన్యలోకం ఇల ఎన్నెన్నో -
అన్నిటికంటే శూన్యలోకమే పై భాగపు అంచున కలదు శూన్యము ఉదయించిన స్థానము అదే, క్షణం మొదలైనది అక్కడే -
శూన్యలోకము ఉన్న కాల వ్యవధి క్షణంలో ఊహకు అందని సమయం అనగా జన్మతో మరణం -
సృష్టిలో ముందుగా ఏర్పడినవి వరుసగా గాలి కొండలు భూమి (మట్టి) నీరు సూక్ష్మమైన మొక్కలు సూక్ష్మజీవులు పక్షులు జంతువులు మొదలైనవి ఎన్నో వివిధ మార్పులతో ఎంతో కాలంగా -
సృష్టిలో ముందు జీవించినది చెట్టు దాని ప్రభావానికి రూపంగా జీవులుగా జంతువులు మానవులు ఎన్నో రకాలుగా మార్పులుగా -
చెట్టుకు పునాది మట్టి అది ఎదగడానికి అవసరమైనవి గాలి నీరు సూర్యరశ్మి ఇల ఎన్నెన్నో మీకు తెలియనివి అర్థం కానివి ఉన్నాయి -
ప్రతి జీవికి చెట్టుకు ముఖ్యంగా అవసరమైనవాటిని పంచభూతాలుగా వాటికి జనన మరణాలను కూడా నిర్ణయించడం జరిగింది -
ఇంకా ఎన్నింటినో స్పష్టంగా వివరించగలనని నాలోని ఆలోచన భావాలు నన్ను కదిలిస్తూనే ఎన్నిటినో తెలుపుతున్నాయి -
నేను తెలిపే వాటిలో నా విజ్ఞానము శూన్య స్థాన విశ్వం నుండి ఆలోచింపగల జ్ఞాన నాడులు నాలో ఉన్నాయి -
నేను ఎంత తెలిపిన మీకు నచ్చినది ఒక భావమైన చాలు నేను నేనుగా శూన్యమువలె జీవించుటకు క్షణముగా -
ఏ రూపమైనా జీవి ఐనా భావమైనా గుణమైనా ఏదైనా ఇది చాలు ఈ ఆత్మ జన్మకు అంతా తెలిసిపోయేను ఒక క్షణాన -
ఇంతకన్నా గొప్పగా మీకు తెలిసి ఉంటె మీ జ్ఞానములో ఒక అణువు భావముగా శూన్యమువలె నిలిచిపోతా ఏ క్షనానైనా -
నేను తెలిపిన కాల క్రమమును దాని ప్రభావము జగతి నిర్మాణ విధానము మీకు తెలియకపోతే ఏనాటికైనా సందేహముగానే ఉండగలదు -
దీనిని పూర్తి వివరణతో చదవుటకు " ప్రకృతిగా పంచభూతములు ఎలా " (ఫిబ్రవరి : 2010) -




1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete