నేను కూడా మరణించాను నాలో కూడా వేదన మిగిలే ఉంది క్షణమైనా మౌనం వహించలేరా -
మరణించిన క్షణముననే మీలో కలిగే భాధలో నే తెలుపలేను నా భావన విజ్ఞాన్నాన్ని -
కన్నీరైనా తుడవలేను ఆత్మగా చూస్తున్నా తెలుపలేను నాలోని వేద రహస్యాన్ని -
ప్రశాంతంగా జీవించేందుకు నా శరీరం కూడా హాయిగా కాలిపోతున్నదే మీ యెదుటనే -
ఆత్మ కూడా విశ్వాన్ని చేరుకుంటే నాతో కలిసి మాటాడెందుకు మీరెవరు రాలేరుగా -
నేను లేననే భాదను మరచి నా ఆత్మ తెలిపే భావనను గమనించేందుకే ధ్యానించలేరా -
నే మరణించిన నాడే కన్నీటిని జారనివ్వక సుఖ శాంతుల శ్వాసతో విశ్వానికి సాగనివ్వలేరా
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete