Saturday, January 2, 2010

మరణమే లేదని జీవిస్తున్నా

మరణమే లేదని జీవిస్తున్నా ఎన్నో ఏళ్ళుగా యుగాలుగా వస్తున్నా కాలానికి తోడుగా -
నేను జన్మించగా కాలం మొదలైనదని శూన్యమున తొలి క్షణం నా భావంతో ఆరంభమైనది -
కాలం ఎలా నడవాలో ఎన్నిటినో సృష్టిస్తూ ఎంతకాలం దేనికి ఎలా జీవం పోయాలో నాతో అంటున్నది -
నేను లేక క్షణం లేదని ఆగలేక నన్ను తనతో తీసుకు వెళ్ళుతున్నదని ప్రయాణాన్ని సాగిస్తున్నా

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete