Thursday, January 14, 2010

శూన్యమున మర్మము దాగినట్లు

శూన్యమున మర్మము దాగినట్లు నా మేధస్సున మర్మము భావమై ఒదిగినదే దివ్య కాలమా -
కాలమున ఆత్మ ధ్యానించగా జ్ఞానమునకు తోచినది భావముగా ఎదుగుటలో మర్మము నీయందెనని -
యుగాలుగా ఆత్మ జ్ఞానముతో అన్వేషిస్తూ నేటికి చేరుకున్నాను శూన్య స్థానమును -
ఎన్నో జన్మలుగా నా ఆత్మ ఎదుగుటకు ఒక భావన నాలో ముడివేసుకొని శూన్యమును చేరుకున్నది -
మర్మమును నాలో పటాపంచలు చేసుకొనుటకు నా భావనకు యుగాలుగా కృషించే ధ్యానశక్తి తోడైనది -
నా భావనకు మరో శక్తిగా ఆలోచనలు సృష్టిలో ప్రయాణిస్తూ శూన్యమును దాటగా మర్మమేనని

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete