ప్రపంచాన్ని మార్చే శక్తి నాలో ఉన్నదని విశ్వ విజ్ఞాన భావాలు నా ఆలోచనలను వెలికితీస్తున్నాయి -
నాటి సమాజ స్థితుల ఘోరాలు ప్రకృతి ప్రభావాలతో కూడిన సమస్యలేకాక ఎన్ని రాబోతున్నాయో తోచటంలేదు -
ఆలోచించే వాడికి మతి పోయేటట్లుంటే అనుభవిస్తున్న వారికి నరాలు వణికి పోతున్నా జీవించాలనే తపన -
ఎన్నో సమాచారాలను చూస్తున్నాం వింటున్నాం ఎన్నాళ్ళు ఇలాంటి అవస్థలు నీ తోటి వారి క్షుద్భాదలు -
నేటి వార్తలలో విజ్ఞానం కరువై అర్థమేలేని సమస్యలతోనే వివిధ రకాలుగా కాలాన్ని వృధా చేస్తున్నాయి -
విచక్షణతో ఆలోచించండి నేటి క్షణమే మేధస్సును ఆలోచనలోతో అరగతీసి విజ్ఞానాన్ని మెరుగుపరచండి -
నాలో ఉన్న అనుభవం మీకు తెలిస్తే మీ చుట్టూ ఉన్న వారి జీవితాలు ఎలా ఉంటాయో ఆలోచిస్తూనే ఉన్నండి -
జీవించేవారికి సరైన సద్గుణ భావ ప్రజ్ఞా విధానాన్ని అనంత విశ్వ విజ్ఞాన ప్రణాళికతో ఏర్పాటు చేయగలను -
సృష్టిలో ప్రతిజీవి సత్యానందంతో జీవించాలని కోరుకుంటే నాతో ఏనాటికైనా కలవండి లేదా ధ్యానిస్తున్నండి -
ఆలోచనలు మారితేగాని మనిషి మారలేడు అలాగే అతనిలోని ప్రవర్తనలవాట్లు మారలేవు సమాజాన్ని మార్చలేడు -
కోట్ల జనాభాలో ఒకరైనా నా విజ్ఞాన ప్రణాళికను తెలుసుకోవాలని గ్రహించగల్గిన లేదా మీ ప్రణాళికను మేధావులకు తెలపండి -
ఏ ప్రణాలికైనా జీవించడానికే కాక నడవడిలో కూడా మార్పు తీసుకురాగల్గితే సమాజంలో మార్పు రాగల్గుతుంది -
ప్రవర్తనలో మార్పులేక ప్రణాళికలు ఎన్నిఉన్న సమస్యలు చిక్కు ప్రశ్నలుగానే పోటెత్తి అధికారానికైనా తల భారమవుతుంది -
సమాజ సేవ చేసేవాడికి అధికారం అనర్థమైనట్లు ఎన్నో కారణాలతో నేటి సమస్యలు తెలియనివిధంగా అవకాశాలు ఆలోచింపక పోతున్నాయి -
శ్రమించే శక్తి లేనివాడే లేదా ఆలోచనా విధానం లేనివాడే ఏదో కావాలని ఎందరినో వివిధ రకాలుగా ఇబ్భందులకు ప్రాణ భయాలను సృష్టిస్తాడు -
ఒక ఉద్యమం అంటే శాంతియుతంగా అవగాహన కలిగినవారే పాల్గొని చర్చాంశనీయంగా భవిష్యత్ జ్ఞానంతో కూడిన ప్రణాళికగా ఉండాలి -
ఒక ప్రదేశ సమాజాన్ని అన్నికోణాలలో మారుస్తూ ప్రపంచానికి తెలుపుతూ అవగాహన కలిగిస్తే ప్రపంచమే మారి జగతిలో శాంతిస్వభావాలే కల్గుతాయి -
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete