ఓ ఆత్మ విజ్ఞాని! ఏ శాస్త్రం నీ దోషాన్ని వదిలిస్తుందో తెలుసుకో
ఓ శాస్త్రం దోషాన్ని వదిలిస్తే నీ ఆత్మ గత జన్మ ఏ రూపానిది
నీ కర్మ ఏ లోకానికి వెళ్ళకుండా నీ ఆత్మ తోనే వస్తున్నదా
శాస్త్ర దోషాలకు విమోచన లేకుండా కర్మ ఆత్మతోనే జీవిస్తున్నది
యుగాలుగా ఎన్నో జన్మలతో కర్మను అనుభవిస్తూనే ఉన్నావు
కర్మ నీతోనే వస్తుందంటే దోషం నీలోనే ఉందని అర్థమవుతుంది
ఆత్మ జ్ఞానంతో కర్మను నాశనం చేసుకో నీ శ్వాసే నీకు విమోచన
శ్వాసను గమనించు ప్రతి కార్యాన్ని విజ్ఞానంగా చేస్తూ జీవించు
శ్వాసలోని మర్మములు మేధస్సుకు తెలియని ఆత్మ భావాలు
No comments:
Post a Comment