మొదటి సారిగా జ్ఞాపకం ఎక్కడ ఏ జీవిలో ఎందుకు మొదలైనదో
ఏ విచక్షణ తత్వంతో ఏ విశ్వ స్వభావ భావంతో ఎలా కలిగినదో
ఆ జీవికి కలిగిన జ్ఞాపక క్షణమే 'ఎరుక' గా ఆనాడు ఆరంభమైనది
మేధస్సులో స్వత భావాలోచన కలిగే అర్థమే ఎరుకగా జ్ఞాపకం
జ్ఞాపకం గతానికే ఉంటుంది మేధస్సు మరల దానిని ఎరుకతో తెలుసుకోవాలి
ఎరుకతో తెలిసిన దానిని మరల గత భావనతో గుర్తించి తెలుసుకోవడమే జ్ఞాపకం
No comments:
Post a Comment