నా స్థాయికి ఏ హోదా అవసరం లేదు
నాకు ఏ ఖరీదు సౌకర్యాలు అవసరం లేదు
ప్రతి రోజుకు కావలసిన కనీస సౌకర్యాలు చాలు
పని తొందరగా కావడానికి శుభ్రతగా ఉండానికి చాలు
కాని నా వారు అన్ని సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు
నా స్థాయికి హోదాకు తగ్గ ఆర్ధిక స్థోమత ఉండాలి కదా
ఇతర సౌకర్యాలు ఉచితంగా రావు మన కష్టార్జితాన్ని వెచ్చించాల్సిందే
విజ్ఞాన ప్రగతి లేని సౌకర్యాలు మనకెందుకు ఆశా జీవితం కష్టతరమే
No comments:
Post a Comment