Tuesday, February 1, 2011

మానవుడు ఎన్నో యుగాలుగా జీవిస్తే

మానవుడు ఎన్నో యుగాలుగా జీవిస్తే తప్ప విశ్వ విజ్ఞాన మహాలోచన కలగదు
విశ్వ కార్యాలోచన కలగడం ఓ దివ్య ముహూర్థమేనని ఆత్మకు కలిగిన భావన
ఎన్నో వేల లక్షల కోట్ల జన్మల ఆత్మలలో కొందరికే కలిగే శతాబ్ధపు ఆలోచన
ఎన్నో జన్మలలో ఎన్నో జీవులుగా జన్మించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది
మానవుడిగా జీవించాలంటేనే ఓ గొప్ప వరముగా మహా రూపార్థ భావన
మానవ జన్మలో వివిధ ఆలోచనలలో ఆత్మ జ్ఞాన విశ్వ భావన కలగడం వరమే
విశ్వ విజ్ఞాన మహాలోచనకు చాలా అనుభవమైన మేధస్సు దివ్య భావాలు ఉండాలి
ఎన్నో రకాల జీవులుగా జన్మిస్తే తప్ప ఆత్మలో విశ్వ తత్వాలు స్థిరం కావు
విశ్వ జీవుల విజ్ఞాన అనుభవంలో విచక్షణ పర ధ్యాసలో మహాలోచన దివ్యత్వమే
మేధస్సులో భావాల అన్వేషణ విశ్వ పరంపరలు దాటి వెళ్లితేనే మహా దివ్యాలోచన
ఆత్మకు జ్ఞానోదయం కావడం మహా తపస్సుతో కూడిన విశ్వ భావాన్వేషణ
భావాలలో ఎంతో పరిశుద్ధ ప్రజ్ఞానం ఉంటే తప్ప విశ్వాన్వేషణలో మహాలోచన కలుగును

No comments:

Post a Comment