ద్వి నేత్రాలతో లోకాన్ని చూసేందుకు చాలటం లేదు
కొన్ని తెలుస్తున్నాయి కొన్ని తెలియకుండా పోతున్నాయి
కొన్నింటిని సరిగ్గా చేస్తున్నాము కొన్ని తప్పులు జరుగుతున్నాయి
చూస్తూనే అన్నీ కనిపించవు అన్నీ ఒకే సారి గుర్తుకు రావు
కనిపించనివి వదిలేస్తున్నాం అలాగే తప్పులు చేస్తున్నాము
చూస్తున్న వాటిలోనే కనిపించేవి కొన్నే కనిపించనివి మరిన్ని
చూస్తూ చూడనట్లుగా పని చేస్తూ తప్పులు చేస్తున్నాము
చూడటంలో తెలిస్తే గుర్తు పట్టితే తప్పులు జరగకుండా ఉంటాయి
సూక్ష్మంగా అన్నింటిని చూసేందుకు ద్వి నేత్రాలు చాలటం లేదు
కనీసం అవసరమైనవి గుర్తు చేసుకొని చూసేందుకైనా ఎరుకను కలిగించు
జీవితంలో తప్పులు కలగకుండా చేసే నేత్ర భావాన్ని కలిగించు
No comments:
Post a Comment