నేను తాకిన నేలపై ఎన్నో జీవిస్తున్నాయి
మొక్కలు చెట్లు వృక్షాలు సూక్ష్మ జీవులు క్రిమి కీటకాలు జంతువులు పక్షులు
జల జీవులు మానవులు ఇంకా ఎన్నో రకాలుగా జీవిస్తూనే ఉన్నాయి
మానవులలో మహాత్ములు యోగులు మహర్షులు ఆత్మీయులు జీవిస్తున్నారు
చెట్లలో పుష్పాలు పండ్లు కాయ గూరలు ఆకులు విత్తనాలు ఎన్నో విధాల జీవిస్తున్నాయి
ఇవే కాక ప్రతి అణువు జీవిస్తున్నది ఎన్నో రకాల అణువులు జీవిస్తున్నాయి
గాలి నీరు భూమి ఆకాశం సముద్రం అగ్ని పర్వతం గిరి శిఖరం ఎన్నో జీవిస్తున్నాయి
మేఘం వర్ణం ప్రకాశం కిరణం కాంతి తేజస్సు మెరుపు ఉరుము పిడుగులు జీవిస్తున్నాయి
సూర్య చంద్రులు నక్షత్రాలు పాల పుంతలు గ్రహాలూ ఎన్నో జీవిస్తూనే ఉన్నాయి
జీవుల శబ్దాలు స్వరాలు భావాలు ధ్వని తరంగాలు ఎన్నో జీవిస్తూనే ఉన్నాయి
ఏవి ఎంత కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జీవిస్తాయో కాల నిర్ణయమే
నేను తాకిన నేల బహు రూపాలతో ఎన్నో అద్భుత వర్ణాలతో జీవిస్తున్నది
No comments:
Post a Comment