Tuesday, February 1, 2011

తెల్లవారితే ఎవరు ఎప్పుడు

తెల్లవారితే ఎవరు ఎప్పుడు మోసగిస్తారోనని నా భావన
చాల మంది ధన సహాయం కోసమే ఎదురు చూస్తున్నారు
అప్పు తీసుకుంటారే గాని తిరిగి ఇవ్వడానికి వెనుకాడుతారు
తీసుకునేటప్పుడు మేధస్సుకు ఎన్నెన్నో ఆశలు కలిగిస్తారు
అవసరానికి ఇస్తే అనవసరమైన వాటికి ఖర్చు పెడతారు
చాల శాతం అవసరమైన వాటికి అలవాట్లకే ఖర్చు చేస్తారు
చాలా వరకు అప్పు అడిగి తిరిగి ఇవ్వని వారిలో ఇతర అలవాట్లు ఉంటాయేమో
/కాలం వేసే శిక్షకు గురయ్యే వారిని గురించి నేను చెప్పటం లేదు/
ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారేనని నా అనుభవ తపన
దీని ద్వారా అప్పు తీసుకున్న వారు ఇచ్చిన వారు ఇద్దరు జీవితంలో నష్టపోతారు
ఎవరి జీవితం అభివృద్ధి లేక ఎవరికి ఆర్ధిక స్థోమత లేక ఎన్నో జీవితాలు నాశనమే
ప్రస్తుత సమాజంలో చాలా వరకు ఉన్నప్పుడు ఖర్చు చేసి లేనప్పుడు అడుక్కోవడం
ఉన్నప్పుడు దాచుకొని అవసరానికి ఉపయోగించుకుంటే అప్పు అనవసరమే
సమాజాన్ని బాగు చేయాలంటే మనిషి ప్రవర్తనలోనే చాల శాతం ఆధారపడి ఉంటుంది
మోసపోతే నిన్ను మోయడానికి ఎవరు రారు బాగా ఆలోచించి సహాయం చేయగలగాలి
అప్పు ఇస్తే మరల తిరిగి రాదని గ్రహించి ఇస్తే ఎంతైనా ఇవ్వొచ్చు ఇక నీ దారి అంతే
అలాగని అనవసరంగా ఖర్చు చేసే వారికి ఇవ్వొద్దు జాగ్రత్త అంతా తీసేసుకుంటారు

No comments:

Post a Comment