ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన మహా సమస్య సాగుతున్నది
ప్రతి దేశంలో ఎన్నో రకాల సమస్యలు సాగుతూనే ఉన్నాయి
ఒక దేశంలో అగ్ని పర్వతాలు మరో దేశంలో భూ ప్రకంపనలు
ఇంకో దేశంలో ప్రేలుళ్ళు మరో దేశంలో జల ప్రలయాలు
ఆహార నీటి సమస్యలు అశుభ్రత కాలుష్య సమస్యలు
ఆర్ధిక అనారోగ్య సమస్యలు మురికి కాలువల సమస్యలు
విద్యుత్ సమస్యలు వాహానాల రహదారుల సమస్యలు
కాల ప్రభావాల సమస్యలు మానవుల జీవన సమస్యలు
చాలా సమస్యలు తొలగాలంటే మనుషుల ప్రవర్తన మారాలి
ఒక నిర్దిష్టమైన విశ్వ క్రమ కార్య కారణ ప్రణాళికను ఏర్పాటు చేయాలి
నాలో ఒక విశ్వ ప్రణాళిక ఉన్నది అమలు చేసే వారు ఎవరో
No comments:
Post a Comment