Thursday, January 2, 2020

శ్వాస హృదయంతోనే జీవించునా

శ్వాస హృదయంతోనే జీవించునా
ధ్యాస ఉదయంతోనే స్మరించునా

భావం ఆలోచనతోనే జీవించునా
తత్వం ఆచరణతోనే స్మరించునా

వేదం మేధస్సుతోనే గమనించునా
జ్ఞానం దేహస్సుతోనే స్పందించునా

రూపం జీవించుటలో విశ్వంతోనే పరిశోధించునా  || శ్వాస ||

ప్రకృతియే మన హృదయ వైద్యం
ఆకృతియే మన ఉదయ స్థైర్యం

జాగృతియే మన దేహ చలనం
ప్రకృతియే మన రూప గమనం

విశ్వతియే మన జ్ఞాన పీఠం
జగతియే మన వేద స్థానం  || శ్వాస ||

భావతియే మన ఆలోచన పరమార్థం
తత్వతియే మన యోచన పరమాత్మం

సంస్కృతియే మన భాష ప్రజ్ఞానం
పధ్దతియే మన శాస్త్ర సిద్ధాంతం

ఉన్నతియే మన ఖ్యాతి ప్రాధాన్యం
సంతతియే మన జీవ పారంపర్యం  || శ్వాస || 

No comments:

Post a Comment