Wednesday, January 8, 2020

ఏనాటి వీరుడవయ్యా ఎంతటి ధీరుడవయ్యా మహానుభావా

ఏనాటి వీరుడవయ్యా ఎంతటి ధీరుడవయ్యా మహానుభావా
ఎప్పటి యోధుడవయ్యా ఎక్కడి శూరుడవయ్యా మహానుభావా

నీ రూపం నీ స్థైర్యం శత్రువులకు సతమతమైన మరణమే మహానుభావా
నీ దేహం నీ ధైర్యం పగవాలకు అపఘాతమైన నిర్వాణమే మహానుభావా

నీలాంటి రౌద్రం నీలాంటి ప్రజ్వలం దేశ ప్రదేశాలకు రక్షణమే మహానుభావా  || ఏనాటి ||

ప్రజలంతా నీవైపే జనులంతా నీవెంటే ఐక్యతగా చైతన్యం నీచెంతే
ఋషులంతా నీవైపే మహర్షులంతా నీవెంటే ఒక్కటిగా సంవేదం నీచెంతే

రాజ్యమంతా నీవైపే సామ్రాజ్యమంతా నీవెంటే ప్రతి ఒక్కరు నీచెంతే
దేశమంతా నీవైపే ప్రదేశమంతా నీవెంటే ప్రతి అధ్యాయనం నీచెంతే  || ఏనాటి ||

గమనం నీవైపే చలనం నీవెంటే ప్రతి జీవి స్మరణం నీచెంతే
భావనం నీవైపే తత్వనం నీవెంటే ప్రతి జీవి జీవనం నీచెంతే

విజ్ఞానం నీవైపే వినయం నీవెంటే ప్రతి ఒక్కరి విధానం నీచెంతే
పరమార్థం నీవైపే పరమాత్మం నీవెంటే ప్రతి ఒక్కరి కర్తవ్యం నీచెంతే  || ఏనాటి || 

No comments:

Post a Comment