Tuesday, January 14, 2020

నీ సౌందర్యమే ప్రకృతి సౌభాగ్యం

నీ సౌందర్యమే ప్రకృతి సౌభాగ్యం
నీ శృంగారమే ప్రకృతి సింధూరం

నీ వయ్యారమే ప్రకృతి మనోహరం
నీ నయగారమే ప్రకృతి మనోరమం

నీ రమణీయమే ప్రకృతి రసభరితం
నీ స్మరణీయమే ప్రకృతి రసచరితం 

జీవించుటలో నీవే జీవులకు ఉత్తేజమైన సృజనాత్మకం  || నీ సౌందర్యమే ||

నీ పర్యావరణమే పరిశుద్ధాత్మం
నీ పత్రహరితమే పరంధాత్మం

నీ ప్రయాణమే సువర్ణ లలితం 
నీ ప్రకంపనమే సుగంధ ప్రణీతం

నీ సుందరమే మధుర కాంతం
నీ స్వభావమే మధుర మంజులం  || నీ సౌందర్యమే ||

నీ పరిపూర్ణమే అలంకారిత ప్రదేశం
నీ సంపూర్ణమే ఆవిష్కారిత ప్రాంతం

నీ పరిశోధనమే అన్యోన్యమైన చలనం
నీ అన్వేషణమే అనూహ్యమైన గమనం

నీ శాస్త్రీయమే అనుచరణమైన విజ్ఞానం 
నీ సిద్ధాంతమే అనుకరణమైన వేదాంతం  || నీ సౌందర్యమే ||

No comments:

Post a Comment