Wednesday, January 1, 2020

ప్రవాహమేదయా పరిశుద్ధమేదయా

ప్రవాహమేదయా పరిశుద్ధమేదయా
ప్రయాణమేదయా పవిత్రమేదయా

ప్రభాతమేదయా ప్రధాతమేదయా
ప్రతేజమేదయా ప్రజ్వలమేదయా

ప్రకృతిని పరిశీలించు జీవ జ్ఞాన విధాన పరిశోధనమేదయా  || ప్రవాహమేదయా ||

ధ్యానించుటలో జీవ ప్రవాహం మేధస్సుకే మహా భరితమయా
గమనించుటలో జీవ ప్రయాసం దేహస్సుకే మహా చరితమయా

జీవించుటలో జీవ ప్రయాణం మనస్సుకే మహా ప్రభాతమయా
స్మరించుటలో జీవ ప్రతేజం వయస్సుకే మహా ప్రశాంతమయా

ఉదయించుటలో జీవ ప్రభాతం ఆయుస్సుకే మహా దీర్ఘమయా
ఆవతరించుటలో జీవ ప్రముఖం శ్రేయస్సుకే మహా తేజమయా  || ప్రవాహమేదయా ||

ఆశ్రయించుటలో జీవ ప్రణాళికం మేధస్సుకే మహా పరిశోధనమయా
ఆవహించుటలో జీవ ప్రమాణం దేహస్సుకే మహా పర్యవేక్షణమయా

ఆదర్శించుటలో జీవ ప్రదర్శనం మనస్సుకే మహా ప్రజాతంత్రమయా
అన్వేషించుటలో జీవ ప్రయోగం వయస్సుకే మహా సృజనాత్మకమయా

తన్మయించుటలో జీవ ప్రభూతం ఆయుస్సుకే మహా ఆనందమయా
విశ్వసించుటలో జీవ ప్రణామం శ్రేయస్సుకే మహా సంభాషణమయా   || ప్రవాహమేదయా || 

No comments:

Post a Comment