Monday, January 13, 2020

కని విని ఎరుగని రీతిలో కవి కవితలు ఎదిగిన ఖ్యాతిలో

కని విని ఎరుగని రీతిలో కవి కవితలు ఎదిగిన ఖ్యాతిలో
స్వర ధ్వని మ్రోగిన శృతిలో గాన సంగీతాలు పొదిగిన గీతిలో

స్వప్త స్వరముల వేణు నాదం రాగ స్వరాగాల వాణి వేదం
శృతి లయల గాన గీతం ధ్వని తరంగాల వీణ వాయిద్యం

సరిగమల పదనిసలతో స్వరాగాల పదాలతో మ్రోగేను గాన మృదంగం  || కని విని ||

కవితల పలుకులతో రాగాల స్వరములతో
పదాల పద్యములతో గీతాల గానములతో

చరణాల ఛందస్సుతో వాక్యాల వ్యాకరణాలతో
గమకాల గమనాలతో శృతుల సమన్వయాలతో

సంగీతం మ్రోగింది సంగ్రాతం అదిరింది సంబరమే జరిగింది స్వరాభిషేకంతో  || కని విని ||

గానముల గేయములతో గీతములు సంగీతములతో
గజ్జెల ఘల్లులతో గాత్రముల సంగాత్రములతో

మువ్వల నృత్యంతో ఢమరుక నాదాలతో
మేళ తాలాలతో పాద పద్మములతో

సంగాత్రం మురిసింది సంగీతం కురిసింది సంతోషమే సాగింది స్వరధ్యానంతో  || కని విని || 

No comments:

Post a Comment