Thursday, January 2, 2020

నన్నే క్షమించవా నన్నే శిక్షించవా

నన్నే క్షమించవా నన్నే శిక్షించవా
నన్నే దండించవా నన్నే శపించవా

నా జీవితం ఎవరికి ఆచరణగా తోచలేదు
నా జీవనం ఎవరికి ఆశ్రయంగా తోచలేదు

నా భావం ఎవరికి అనుబంధం కాలేదు
నా తత్వం ఎవరికి అనురాగం కాలేదు

నా ఆలోచన నాలోనే నాతోనే ఆగిపోయింది  || నన్నే ||

నా రూప భావం ఎవరికి ఏమని తెలుసు
నా దేహ తత్వం ఎవరికి ఏమని తెలుసు

నా వేద నాదం ఎవరికి ఏమని తెలుసు
నా జ్ఞాన రాగం ఎవరికి ఏమని తెలుసు

ఎదుగుదల లేని జీవితం ఎవరికి ఇష్ఠంగా కలుగును
పెరుగుదల లేని జీవనం ఎవరికి ప్రియంగా కలుగును 

హితం ప్రేమం ప్రియం స్నేహం ఎవరికి ఎలా ఉంటాయో తెలుసా  || నన్నే ||

నా జీవ స్మరణం ఎవరికి ఏమని తెలుసు
నా ఆత్మ గమనం ఎవరికి ఏమని తెలుసు

నా శ్వాస చలనం ఎవరికి ఏమని తెలుసు
నా ధ్యాస పయనం ఎవరికి ఏమని తెలుసు

అభివృద్ధి లేని జీవితం ఎవరికి ఇష్ఠంగా కలుగును
సంవృద్ధి లేని జీవనం ఎవరికి ప్రియంగా కలుగును 

హితం ప్రేమం ప్రియం స్నేహం ఎవరికి ఎలా ఉంటాయో తెలుసా  || నన్నే || 

No comments:

Post a Comment