ఏనాటి వాడివో సూర్య దేవా
ఎంతటి వాడివో సూర్య దేవా
ఎక్కడి వాడివో సూర్య దేవా
ఎలాంటి వాడివో సూర్య దేవా
నిన్నే ఆచరించి కొలిచెదము
నిన్నే ఆశ్రయించి జీవించెదము || ఏనాటి ||
నీ రూప తేజమే మేధస్సుకు ఉత్తేజము
నీ స్వర్ణ భావమే దేహస్సుకు ఉల్లాసము
నీ కాంతి స్వరూపమే వయస్సుకు ప్రకాశము
నీ శాంతి స్వరూపమే మనస్సుకు ప్రజ్వలము
నీ విశ్వ కిరణమే ఆయుస్సుకు పర్యావరణము
నీ దివ్య కిరణమే శ్రేయస్సుకు పత్రహరితము || ఏనాటి ||
నీ సూర్యోదయమే మేధస్సుకు సుగుణ విచక్షణము
నీ శుభోదయమే దేహస్సుకు సుగంధ ఇంద్రియము
నీ మహోదయమే వయస్సుకు సుజన సంస్కారము
నీ సర్వోదయమే మనస్సుకు సుఫల సంభాషణము
నీ నవోదయమే ఆయుస్సుకు సుందర కవచము
నీ జీవోదయమే శ్రేయస్సుకు సుమిత్ర సిద్ధాంతము || ఏనాటి ||
ఎంతటి వాడివో సూర్య దేవా
ఎక్కడి వాడివో సూర్య దేవా
ఎలాంటి వాడివో సూర్య దేవా
నిన్నే ఆచరించి కొలిచెదము
నిన్నే ఆశ్రయించి జీవించెదము || ఏనాటి ||
నీ రూప తేజమే మేధస్సుకు ఉత్తేజము
నీ స్వర్ణ భావమే దేహస్సుకు ఉల్లాసము
నీ కాంతి స్వరూపమే వయస్సుకు ప్రకాశము
నీ శాంతి స్వరూపమే మనస్సుకు ప్రజ్వలము
నీ విశ్వ కిరణమే ఆయుస్సుకు పర్యావరణము
నీ దివ్య కిరణమే శ్రేయస్సుకు పత్రహరితము || ఏనాటి ||
నీ సూర్యోదయమే మేధస్సుకు సుగుణ విచక్షణము
నీ శుభోదయమే దేహస్సుకు సుగంధ ఇంద్రియము
నీ మహోదయమే వయస్సుకు సుజన సంస్కారము
నీ సర్వోదయమే మనస్సుకు సుఫల సంభాషణము
నీ నవోదయమే ఆయుస్సుకు సుందర కవచము
నీ జీవోదయమే శ్రేయస్సుకు సుమిత్ర సిద్ధాంతము || ఏనాటి ||
No comments:
Post a Comment