మనోజ్ఞ భరితమా
అభిజ్ఞ చరితమా
సుజ్ఞాన వచనమా
ప్రజ్ఞాన చరణమా
విజ్ఞాన వేదనమా
జిజ్ఞాస చలనమా
జ్ఞాన మంజీర వేదాంత పఠనమా
జ్ఞాన సంజీవ ఆద్యంత బోధనమా
సర్వ విధ హిత జ్ఞాన మధుర మహాన్విత మకుటమా || మనోజ్ఞ ||
జీవించుటలో నీ జ్ఞానం అమర వేదాంతం
ధ్యానించుటలో నీ జ్ఞానం అఖిల వైభోగం
గమనించుటలో నీ జ్ఞానం మధుర వైవిధ్యం
స్మరించుటలో నీ జ్ఞానం మాణిక్య విశేషణం
పఠించుటలో నీ జ్ఞానం ప్రభాత ప్రసిద్ధం
ధ్వనించుటలో నీ జ్ఞానం ప్రణామ ప్రముఖం || మనోజ్ఞ ||
సంభాషించుటలో నీ జ్ఞానం చతుర చాతుర్యం
విశదీకరించుటలో నీ జ్ఞానం ప్రవీణ ప్రఖ్యాతం
అభ్యసించుటలో నీ జ్ఞానం అనంత ఆశయం
అధ్యాయించుటలో నీ జ్ఞానం అపార ఆదేశం
తిలకించుటలో నీ జ్ఞానం త్రిగుణ తపనం
పూరించుటలో నీ జ్ఞానం సుగుణ సఫలం || మనోజ్ఞ ||
అభిజ్ఞ చరితమా
సుజ్ఞాన వచనమా
ప్రజ్ఞాన చరణమా
విజ్ఞాన వేదనమా
జిజ్ఞాస చలనమా
జ్ఞాన మంజీర వేదాంత పఠనమా
జ్ఞాన సంజీవ ఆద్యంత బోధనమా
సర్వ విధ హిత జ్ఞాన మధుర మహాన్విత మకుటమా || మనోజ్ఞ ||
జీవించుటలో నీ జ్ఞానం అమర వేదాంతం
ధ్యానించుటలో నీ జ్ఞానం అఖిల వైభోగం
గమనించుటలో నీ జ్ఞానం మధుర వైవిధ్యం
స్మరించుటలో నీ జ్ఞానం మాణిక్య విశేషణం
పఠించుటలో నీ జ్ఞానం ప్రభాత ప్రసిద్ధం
ధ్వనించుటలో నీ జ్ఞానం ప్రణామ ప్రముఖం || మనోజ్ఞ ||
సంభాషించుటలో నీ జ్ఞానం చతుర చాతుర్యం
విశదీకరించుటలో నీ జ్ఞానం ప్రవీణ ప్రఖ్యాతం
అభ్యసించుటలో నీ జ్ఞానం అనంత ఆశయం
అధ్యాయించుటలో నీ జ్ఞానం అపార ఆదేశం
తిలకించుటలో నీ జ్ఞానం త్రిగుణ తపనం
పూరించుటలో నీ జ్ఞానం సుగుణ సఫలం || మనోజ్ఞ ||
No comments:
Post a Comment