Friday, January 31, 2020

వివరణమా విశేషణమా

వివరణమా విశేషణమా
విరివిగా విడివిడిగా విశ్లేషించుమా

వినయమా విధేయమా
వివేకంతో విద్యార్థులనే విశ్వసించుమా

విశిష్టమా వినూతనమా
విశ్వతికే విశాలమైన విజయమా

విభక్తమా విభాజకమా
విడదీయని వినాయక విభాకరమా

విచక్షణమా వేదాంతమా
వేదాలయమే వాత్సల్య వ్యూహనమా

వసంతమా వికాసమా
వెన్నెల వర్ణముల విజ్ఞానందమా

వ్యాకరణమా వాచకమా
విస్తృతమైన వాక్యాల విద్యాంశమా

విభూషణమా విభూతమా
విస్తృతమైన వ్యాపార వ్యవహారమా

వచనమా వాదనమా
విలేఖరి వైఖరి వినియోగమా

వైరాగ్యమా వినోదమా
విహారించే విరాజిత విదేశమా

వైకుంఠమా వైవిధ్యమా
వైశాల్యమైన విశ్రాంతి వైభోగమా

వివాహమా వరకట్నమా
వధువుతో వరుడు విలాసమా

వందనమా వసుంధరమా
విభాగాల వయ్యార వాలకమా 

విగ్రహమా విచిత్రమా
విశుద్ధమైన వ్యవధుల విషయమా 

వంటకమా వృద్ధాప్యమా
వయస్సుతో వృద్దులకు విరామమా 

--

వితండమా విజృంభణమా
విభిన్నమైన విపులత్వ విచారణమా

విరుద్ధమా విధ్వంసమా
విధుల విపరీత వైపరీత్యమా

విఘాతమా వినాశనమా
వ్యసన వ్యత్యాసాల విపత్కాలమా

విషాదమా విపత్తమా
వైద్యుల వైద్యంతో విముక్తమా

విచారమా విడ్డూరమా
వంచకులకు వికృత వరమా

విత్తనమా వ్యవసాయమా
వర్జ్యములను వెల్లడించు విసర్జనమా

--

No comments:

Post a Comment