Friday, January 3, 2020

శృతిమించి పోవునా నీ శృతిలయం

శృతిమించి పోవునా నీ శృతిలయం
స్వరమించి పోవునా నీ స్వరలయం 

శృతి మరచి పోవునా నీ శృతిరాగం
స్వర మరచి పోవునా నీ స్వరరాగం

శృతి స్వరమే స్తంభించి పోవునా నీ సరిగమలకు
స్వర శృతియే సంకటించి పోవునా నీ పదనిసలకు

సంగీతాన్ని స్మరణం చేసుకో సరిగమలను సవరణం చేసుకో పదనిసలను సక్రమం చేసుకో
గీతమే సంగీతమై గానమే సంగాత్రమై గేయమే సమన్వితమై సాగించును నీ శృతి స్వరంలో  || శృతిమించి ||

పల్లవియే పలకించునా నీ రాగ స్వరాగాలను సమ వాణిలో
చరణమే పులకించునా నీ గీత సంగీతాలను సమ బాణీలో

భావనమే శృతించునా నీ గాన గీతాలను సమ సాహితిలో
తత్వనమే స్వరించునా నీ రాగ స్వరాలను సమ వైఖరిలో  || శృతిమించి ||

గమనమే ధ్వనించునా నీ రాగ శృతి వేదాలను సమ దారిలో
చలనమే వర్ణించునా నీ భావ స్వర నాదాలను సమ తీరిలో

స్మరణమే కార్యాచరణమై నీ వేద గీతాలను శృతించునా సమ పాళిలో
తరుణమే కార్యాదరణమై నీ నాద గేయాలను స్వరించునా సమ తాళిలో  || శృతిమించి || 

No comments:

Post a Comment