Wednesday, February 2, 2011

మేధస్సు ఏక కాల త్రిలోచన భావాలతో

మేధస్సు ఏక కాల త్రిలోచన భావాలతో సాగుతుంది లేదా పని చేస్తుంది
గత వర్తమాన భవిష్య భావాలతో మూడు ఆలోచనలు ఒకే కాలంలో సాగుతాయి
ఒక కార్యాన్ని చేయుటలో మూడు ఆలోచనలు ఒకేసారి కలుగుతూ సాగుతాయి
1. మొదటిది భవిష్యత్ కు వెళ్ళిపోతుంది
2. రెండవది వర్తమానాన్ని సూచిస్తూ భవిష్యత్ కు నెట్టేస్తుంది
3. మూడవది వర్తమానానికి(నాన్ని) సాగిస్తూ గతాన్ని గుర్తు పెట్టుకుంటుంది
ఈ మూడు భావాలే మూడు ఆలోచనలుగా మనలో కలుగుతూ సాగుతాయి
ఈ మూడు ఆలోచనలు ఒకే కాలంలో కలుగుతాయి
వ్యత్యాసం ఉన్నా గుర్తించలేని అతి తక్కువ కాలంలో త్రిలోచనలు జరిగిపోతాయి
/వీటిని ఇంకా వివరణగా తెలుసుకోవాలంటే నేను ఇంతకు ముందు తెలిపిన
మేధస్సు ఎలా పని చేస్తుంది చదివితే అర్థమవుతుంది /

No comments:

Post a Comment