మేధస్సులో మరుపు నిద్రలో మైమరుపు మేఘంలో మెరుపు
జీవితమే మర్మంలా అన్నీ మాయా మరుపులతో సాగుతున్నాయి
ఎంత విజ్ఞానం ఉన్నా మరుపుతో జీవితం మెలికలు తిరుగుతోంది
జీవితం ఎన్ని మలుపులు తిరిగినా మేధస్సుకే అజ్ఞాన విజ్ఞానం
ఎరుకతో విజ్ఞానం తెలిసినా మరుపుతో అజ్ఞానం కలుగుతూనే ఉంటుంది
అజ్ఞాన విజ్ఞానాలు మేధస్సును వీడవు కాలంతో సాగుతూనే ఉంటాయి
No comments:
Post a Comment