ఒకరు తెలిపిన మాటలను అర్థంగా తెలియనప్పుడు ఎప్పుడూ ఎవరికి తెలుపవద్దు
వారు తెలిపిన ఉద్దేశ్యాలు వేరుగా ఉండవచ్చు నీకు మరో విధంగా అర్థం కావచ్చు
అర్థం కానివే ఎప్పుడూ తెలుపుకుంటూపొతే నీలో కొత్త విజ్ఞానం ఏనాటికీ కలగదు
కొత్త విజ్ఞానంకై నీ మేధస్సును విశ్వంలో అన్వేషించేలా ఆలోచనలను మార్చుకో
ఓ విశ్వ విధాతగా నీవు మహాత్మగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించు
No comments:
Post a Comment