Saturday, August 28, 2010

ఈ పాట ఏనాటిదో మాట తెలుపలేక

ఈ పాట ఏనాటిదో మాట తెలుపలేక నాలో ఆగి పోయినది
పాత పాటగా పాడుతున్నా పలుకులో కొత్తగా వినిపిస్తున్నది
చెవిని తాకితే తేలిపోయే స్వరంతో రాగమై మేల్కోల్పుతున్నది
భావాలతో స్వరాగాల స్వభావాలను తెలుపుతూనే ఉన్నది
సంగీతంలో భావాలకు స్వర్గమే శ్వాసలో తేలిపోదా
రాగాలలో స్వభావాలకు స్వప్నాలే మేధస్సులో చేరిపోవా
జీవితాన్ని హాయిగా మార్చుకో శ్రమిస్తున్నా సంతోషం పాటలోనే
ఎన్ని విధాల ఆలోచించినా జీవితాన్ని ఆనందంతో సాగించడమే
ఆరోగ్యాన్ని కలిగించే సంగీతం నా పాటలో రాగమై దాగి ఉన్నది
అన్వేషించే బాట తెలిస్తే గతమంతా క్షణమే గమ్యమే మరో క్షణం

No comments:

Post a Comment