విశ్వ భాషలో మౌనమై విశ్వ తత్వాల భావ స్వభావాలనే గ్రహిస్తున్నా
విశ్వ భాషతో విశ్వ విజ్ఞాన వేద సారాంశాన్ని అవగాహన చేస్తున్నా
విశ్వమందే జీవిస్తూ మౌనమే వహిస్తూ ఆకాశమునే తిలకిస్తున్నా
విశ్వ రూపముల దివ్య కాంతులను సూక్ష్మ జ్ఞానంతో పరిశీలిస్తున్నా
విశ్వ గ్రహాలనే కాక అత్యంత రూపములను ఎన్నింటినో గమనిస్తున్నా
విశ్వ భాషతో అన్వేషించే నా మేధస్సు మహా ధ్యాసలో ఆలోచించునా
No comments:
Post a Comment