Sunday, August 29, 2010

ఏ ప్రభూ! విశ్వ జీవులకు ప్రాణాన్ని

ఏ ప్రభూ! విశ్వ జీవులకు ప్రాణాన్ని సమపాలలో ఇచ్చావు
రూపాలను మాత్రం వివిధ పరిణామాలలో ఎన్నో సృష్టించావు
భావాలను కూడా వివిధ రకాల విచక్షణాలతో కల్పించావు
ఎన్నిటినో వేరుగా కల్పించి ప్రాణాన్ని మాత్రమే సమానంగా ఇచ్చావు
జీవితకాలాన్ని ఆలోచనల అజ్ఞాన విజ్ఞానాన్ని వివిధ రకాలుగానే ఇచ్చావు
జీవించే విధానంలో స్థానాల ప్రభావాలనూ వివిధ కోణంలోనే కల్పించావు
ఎన్ని వేరైనా ప్రాణముతో అన్నీ జీవరాసులు సమానమేనని తెలుపుతున్నావు

No comments:

Post a Comment