మేధస్సులో ఏ ఆలోచన ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడు మరచిపోతాం
ఏ ఆలోచనతో ఎలా జీవిస్తాం ఎన్ని ఆలోచనలను మేధస్సు స్వీకరించును
ఎన్ని ఆలోచనలు అర్థమౌతాయి ఎన్నింటిని శాశ్వితంగా మరచిపోతాం
ఏ ఆలోచన ఏ భావ స్వభావాన్ని మేధస్సుకు ఎలా తెలుపుతుంటుంది
నా మేధస్సులో ఆలోచన చక్రాన్ని ఉత్తేజమునకై భావనతో నిర్మించుకున్నా
ఉత్తేజముతో మేధస్సు యొక్క సామర్థ్యం పెరుగుతూ అపార విజ్ఞానాన్ని సేకరిస్తుంది
No comments:
Post a Comment