ఓం కార నాదాన్ని మౌనంతో మనస్సులో స్మరిస్తే
అంతర్భాగాన శ్వాస విశ్వంతో ఏకమై లీనమైపోవునే
నీ ధ్యాస విశ్వమున ఏకమై ధ్యానమే ఆరంభమగునూ
ధ్యానమున నీలో విశ్వ శక్తి మేధస్సున ప్రవేశించునే
మేధస్సులోని భావాలతో నీ శరీరం కాంతి స్వరూపమే
కాంతి భావాలతో నీ శిరస్సుపై నక్షత్ర కమలమే ఉదయించును
కమలమున దాగిన విజ్ఞానమే విశ్వ చైతన్య పరిపూర్ణము
ప్రతి జీవి ధ్యానమే విశ్వ చైతన్య సంపూర్ణ విజయము
No comments:
Post a Comment