కొత్త భావాలు కలిగే వరకు పాత భావాలు మనల్ని వేదిస్తూనే ఉంటాయి
కొత్త భావాలతో పాత భావాలను తాత్కాలికంగా మరచిపోతున్నాము
కొత్త భావాలు మరో కొత్త భావాలతో పాత భావాలుగా మారిపోతాయి
కొత్త భావాలు పాత భావాలుగా మారిపోతే మనలో ఇంతకు ముందు పాత భావాలు గుర్తొస్తాయి -
మనిషి ఆలోచనలలో కొత్త భావాలు త్వరగా కలగకపోతే పాత భావాలే గుర్తొచ్చి వేదిస్తుంటాయి -
ఏ భావం కలిగినా మనిషి మరణించే వరకు జీవించాలి కనుక అద్భుతాలనే తిలకిస్తూ సాగాలి -
జీవిత అద్భుతాలకై కొత్తగా విశ్వం నలుమూలల మహా భావాలతో ప్రయాణిస్తూ అన్వేషించండి -
No comments:
Post a Comment