ఎన్ని పూజలు చేసినా ఆచారాలు పాటించినా సిద్ధాంతాలు తెలిసినా మేధస్సుకు అజ్ఞానం కలుగుతూనే ఉంటుంది -
కాలం ఎప్పుడూ మేధస్సును మరిపించి మరో ధ్యాసలో అజ్ఞానాన్ని కలిగించేలా ప్రతి క్షణం వెంబడిస్తూనే ఉంటుంది -
ప్రతి కార్యానికి సూటిగా చేసే విజ్ఞాన ఆలోచనను కలిగించలేక మరో విధంగా చేసేలా అజ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటుంది -
అజ్ఞానంతో అనుభవాన్ని తెలుసుకొని సూటిగా చేసే కార్య కారణ విషయాన్ని తెలుసుకొని విజ్ఞానాన్ని గ్రహిస్తాము -
ఒక కార్యాన్ని సూటిగా చేసే కార్య కారణ విషయం తెలిసిన తర్వాత మిగిలిన కార్యాలను కూడా సూటిగా చేయగలగాలి -
ప్రతి కార్యంలో దాగిన కార్య కారణ విషయాన్ని గ్రహిస్తూ పొతే పొరపాట్లు జరగక అడ్డంకులు కలగకుండా పోతాయి -
ప్రతి కార్యాన్ని సూటిగా చేయగలగాలంటే మేధస్సులో మహా ఏకాగ్రత ఉత్తేజం భవిష్య విజ్ఞాన ప్రణాళిక దాగి ఉండాలి -
మేధస్సుకు అన్నీ సాధ్యం కావు కనుక అజ్ఞానం జన్మించినప్పటి నుండి మరణించేవరకు కలుగుతూనే ఉంటుంది -
మన ప్రయత్నం మనం చేస్తూ వీలైన సమస్యలను తగ్గిస్తూ విజ్ఞానంగా ఎరుకతో కార్యాలను చేసుకుంటూ సాగాలి -
కాల ప్రభావాలు కూడా సూటిగా చేసే కార్యాలకు ఎన్నో అడ్డంకులను అప్పుడప్పుడు కలిగిస్తూనే ఉంటాయి -
నిరుత్సాహం లేక జీవితాన్ని విజ్ఞానంగా ముందుకు సాగిస్తూ మరొకరికి ఆదర్శంగా దారి చూపిస్తూ ఉండాలి -
అనవసరమైన కార్యాలను కోరికలను ఆలోచనలను మానుకుంటేనే సమస్యలు తగ్గి విజ్ఞానం పెరుగుతూ వస్తుంది -
No comments:
Post a Comment