Friday, August 27, 2010

విశ్వమున ప్రతి రూపము నాకు

విశ్వమున ప్రతి రూపము నాకు అణువు గానే అనిపిస్తున్నది
నేత్రమున విశాలమైనా మేధస్సులో అణువుగానే తోస్తున్నది
అణువు కూడా పరమాణువుగా మేధస్సులో విజ్ఞానమైనది
ప్రతి రూపము అణువుల సముదాయమైనా అంతా అణువుగానే
విజ్ఞానముకై ప్రతి రూపాన్ని అణువణువునా అణువుగా పర్యవేక్షిస్తున్నా
అణువు యందలి దాగిన జ్ఞానము సూక్ష్మ అణువుగా విజ్ఞానం కలిగినది
అణువుగా తెలిసిన జ్ఞానమే విశ్వ విజ్ఞానమై అణు సిద్ధాంతాన్ని తెలుపుతుంది

No comments:

Post a Comment