మీలో వింత విజ్ఞానం ఉంటే నాకు తెలపండి
నాలో ఉన్న విజ్ఞానం మీకు తెలుపుతున్నా
ఒకరి విజ్ఞానంతో మరొకరు మరో విజ్ఞానాన్ని తెలుసుకుంటారు
ఎందరికో తెలిసిన విజ్ఞానంతో ఎందరో విజ్ఞానవంతులు అవుతారు
మహా విజ్ఞానంతో విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చనే నా భావన
అద్భుత సాహాస ఆశ్చర్య మహా సూక్ష్మ విజ్ఞానం వింతయే కదా
ఆధునిక సాంకేతిక విజ్ఞానం వివిధ రంగాలలో ఎన్ని వింతలో
విశ్వమున ప్రతి స్థానమున ఎప్పుడు ఏ విజ్ఞానం కలిగినా నా మేధస్సులో చేరుతుంది
No comments:
Post a Comment