ఒక్క సారి భగవంతుని భావన వస్తే ఇక అజ్ఞానం కలగరాదు
మరి నేడు స్మరిస్తున్న వారిలో మరల అజ్ఞానం ఎందుకు కలుగుతున్నది
నాలోనూ అజ్ఞానం కలుగుటలో భగవంతుని భావన ను మరచిపోయానా
నేడు జీవిస్తున్న విధానంలో కలిగే మార్పులలో భగవంతుని భావన అవసరం లేదా
సమాజంలో కలిగే అజ్ఞాన సమస్యలకు పరిష్కారాలు లేక జీవితాలు విఫలమవుతున్నాయి
కాలం ఎలా సాగిపోతేనేమి నేను జీవిస్తున్నాను ఇక చాలు అనుకుంటే సరిపోతుందా
ఒక్కసారి విజ్ఞాన భావన కలిగిన తర్వాత మరల అజ్ఞాన భావన కలుగుటలో మానవ మేధస్సు ఎందుకు
విజ్ఞానంగా జీవించాలని అనుకుంటాము అలాగే అందరు చెబుతారు మరల అజ్ఞానంగా అందరు జీవిస్తారు
ఎవరికి కావలసిన వారి కార్యాలు లాభాలు చూసుకుంటున్నారు అంతేగాని అజ్ఞాన విజ్ఞానాలు ఎందుకు
No comments:
Post a Comment