మానవుడు ఏ యంత్రాన్నైనా ఏ విధంగానైనా సృస్టించగలడు
విశ్వంలో లభించే ఖనిజాలను యంత్ర పరికరాలుగా మార్చగలడు
యంత్ర పని ముట్లను తయారుచేసుకొని యంత్ర పరికరాలను అమర్చగలడు
యంత్రానికి కావలసిన ఇంధనంతో పనే చేసి విధంగా ఉపయోగించుకోగలడు
యంత్రములో లోటు పాట్లు కలిగినా మరమత్తు చేసి మళ్ళీ నడిపించగలడు
యంత్రాల ద్వారా ఎన్నో వస్తువులను మళ్ళీ మరో యంత్రాలను తయారుచేయగలడు
యంత్రాల ద్వారా ఎన్నో పరిశ్రమలు ఎన్నో రకాలుగా ఎక్కడెక్కడో వెలిశాయి
ఎందరో ఎన్నో రకాలుగా ఎన్నో యంత్రాలను తమకు అనుగుణంగా తయారుచేశారు
సూది నుండి ఉప గ్రహాల వరకు ప్రతీది మానవుడు సృష్టించిన యంత్ర తంత్ర విధానమే
మానవుని మేధస్సులో ఎన్నో ఆలోచనలు ఎన్నో రకాలుగా ఎన్నో అన్వేషణలు
మానవుని అన్వేషణలో కృషితో సాధించేవే మహా యంత్ర భావ నిర్మాణములు
No comments:
Post a Comment