అప్పు తీసుకున్న వాడి ప్రవర్తన మరు క్షణం నుండే మారుతుంది
ఇచ్చిన వాడు ఎప్పుడు అడుగుతాడా అని ముఖాన్ని చూపించలేడు
కనీసం మాట్లాడడానికి కూడా తను ఏ మాత్రం అనుకరించడు
కనిపించినా చూడలేదన్నట్లు పక్కన నుండే వెళ్ళిపోతాడు
వీలైతే కనిపించలేని విధంగా తప్పించుకుని తిరుగుతాడు
చాలావరకు అబద్ధాలు మాట్లాడటం అలవాటైపోతుంది
అప్పు తిరిగి ఇవ్వలేనని చెప్పలేక శత్రువులా తిరుగుతుంటాడు
అప్పు తీసుకునేటప్పుడు పొగడేస్తారు ఆతర్వాత తిట్టేస్తారు
ఇలాంటి వారు సమాజంలో ఎందుకో అర్థం కావటం లేదు
ఇచ్చిన వారి పరిస్థితి చచ్చినట్లే ఇక నిరాశ భావనతోనే జీవితం
No comments:
Post a Comment