మనిషికి మాట మీద ధ్యాస లేదు ధ్యాస ఉన్నా లేనట్లు నటిస్తారు
ఆర్ధిక సహాయాన్ని కోరేటప్పుడు అన్నీ గుర్తు చేసుకొని పొగిడేస్తారు
లేనిపోని మాటలతో లేనివన్నీ చెప్పి ఆశల మాటలతో ఉప్పొంగిస్తారు
తీర్చేటప్పుడు అడిగితే అలా కాదు నేను మళ్ళీ ఇస్తానని చెప్పేస్తారు
ఆ తర్వాత మాట్లాడరు కనిపించరు కనపడిన మనకు కనిపించనట్లు తిరిగేస్తారు
మనల్ని చూసినా చూడలేదన్నట్లు నటిస్తూ జారుకుంటూ వెళ్ళిపోతారు
ఒక వేళ అనుకోకుండా కలిస్తే నేను ఇలా చెప్పాను ఇలా కాదని అంటారు
నాకు ఇంత నష్టం వచ్చింది ఇక నేను ఇవ్వలేనని గట్టిగా వాదిస్తారు
వీలైతే ఇక తమ దగ్గరకు వెల్ల లేనంతగా కొట్టేలా తరిమేస్తారు
ఎలా ఇవ్వకూడదో చెప్పడానికి అన్నీ గుర్తుంటాయి ఇవ్వడానికే నటిస్తారు
ఏమి తెలియనట్లు తీసుకోలేదన్నట్లు ఇక అడగరాదనే విధంగా చెప్పేస్తారు
వాళ్లకు అన్నీ ఉంటాయి కాని ఎందుకు అప్పు తీర్చరో అర్థం కావట్లేదు
కోటీశ్వర్లుగా అన్ని వసతులు సౌకర్యాలు భోగ భాగ్యాలు ఉంటాయి
మాటల్లో ఐతే అసత్యం మేధస్సులో స్వార్థం మోసం అజ్ఞానం అరాచకం
విధి కర్మ లేనివాడిని ఇచ్చే వాడినే వెంటాడుతుంది అజ్ఞానులను వెంటాడదే
ఉన్నవాడు లేనివాడిని మోసగిస్తూ అన్నీ అనుభవిస్తూ జీవిస్తున్నారు
లేనివాడు కష్టపడుతూ సహాయం చేస్తే ఏమి లేకుండా చేస్తారు
నీ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న వారు నిన్ను మోసగిస్తారు
నీకు ధనం ఉందంటే బుట్టలో వేసుకొని లేనిపోనివి చెప్పి మోసగిస్తారు
మనిషికి జీవించే విధానము తెలియదే మోసగించే విధానమే తెలుసే
తెలివిగా మోసగిస్తూ అనర్థాలతో జీవించడం జీవితమేనా వెళ్ళిపోండి
ధన సహాయాన్ని కోరకుండా శ్రమిస్తూ జీవించేవారే సృష్టిలో మహాత్ములు
మోసగించే మాటలపైననే మానవుని ధ్యాస ధనం ఉన్నా సహాయం చేయరు
No comments:
Post a Comment