భావన నుండి బ్రంహాండం వరకు ప్రతి క్షణం నేను నమస్కరిస్తూనే ఉన్నాను
ప్రతీది కనిపిస్తున్నా కనిపించక పోయినా కనిపించబోతున్నా నా నమస్కారమే
జరిగిపోయినా జరిగిపోతున్నా జరిగే వాటికి నా ఆలోచనలలో నమస్కారమే
ఉన్న దానికైనా లేని దానికైనా రాబోయే దానికైనా నాలోన నమస్కారమే
తెలిసిన తెలియక పోయినా తెలియ బోతున్నా ప్రతి క్షణం నా నమస్కారమే
నా నమస్కారం లేనిదే ఏ క్షణమైనా కాలమైనా శూన్యమైనా మర్మమైనా లేదనే
No comments:
Post a Comment