విశ్వమా! ఉచ్చ్వాస నిచ్చ్వాసములతో ఎలా జీవిస్తున్నావు
విశ్వమందు పంచ భూతముల జనన మరణాలు ఎలా ఉన్నాయి
ఒక వైపు ఎదుగుదల మరో వైపు తరుగుదల ఇలా ఎన్నెన్నో
ఓ వైపు ఉచ్చ్వాసతో మరో వైపు నిచ్చ్వాసతో సృష్టి జీవిస్తున్నది
విత్తనం వృక్షమవుతున్నది అలాగే వృక్షాలు తరిగిపోతున్నాయి
విశ్వమా నేను నీ లాగే ఎదుగుతూ తరుగుతూ జీవిస్తున్నాను
నీ ఉచ్చ్వాస నిచ్చ్వాస భావాలు నాలో జీవిస్తూనే ఉంటాయి
No comments:
Post a Comment