నీవు చేసే పనిలో నీ ధ్యాస ఎరుకతో ఉంటే చాలు ఏం జరుగునో తెలియును
ఇక రాశులు గ్రహాలు నక్షత్ర స్థితి గతుల యంత్ర మంత్ర తంత్రాలు ఎందుకు
ఏ శాస్త్రములు ఏం చెప్పినా విజ్ఞాన తర్క శాస్త్రము తెలిస్తే చాలు
జీవించుటకు వీలుగా వివిధ కార్యాలు సక్రమంగా జరిగిపోతాయి
ఏ కార్యాన్ని ఏ క్రమముగా ఎలా చేయాలో తెలుసుకుంటే చాలు
జీవితం వివిధ పరిష్కారాలతో ముందుకు సాగుతూ వెళ్ళిపోతుంది
No comments:
Post a Comment