మేధస్సు నిద్రిస్తున్నదని ఎక్కడంటే అక్కడ నిద్రిస్తున్నారా
మహా అజ్ఞాన అలవాట్లతో అశుభ్రతగా ఉన్న చోటే నిద్రిస్తున్నారా
నిద్రించేటప్పుడు తెలియకపోయినా మేల్కొన్నాకైనా ఆలోచించలేదా
అజ్ఞాన అలవాట్లను వదులుకోవాలని ఏనాడు ఆలోచించ లేదా
నీ అజ్ఞాన ధ్యాసలో నీ వస్త్రాలు కూడా నీకు తెలియనట్లుగా చూడలేనంతగా
అశుభ్రత భావాలు నీలో ఉన్నంతవరకు అశుభ్రతయే నీ స్థానం
అజ్ఞాన అలవాట్లు కలవారికి మేధస్సులో విజ్ఞాన భావాలు శూన్యమే
ఆలోచించ లేనంతగా అలవాట్లకు బానిస కావడం దేహాన్ని కాల్చుకోవడమే
ఆలోచన కలగడానికి కూడా స్పృహ లేకపోతే దేనిని గమనించగలవు
అమృతమైన ఫలహారాలు పానీయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి
అజ్ఞాన అలవాట్లతో మహా గుణాల మేధస్సు సామర్థ్యాన్ని తగ్గించుకోవటమే
విధి తెలిసినా భవిష్యత్ ను ఆలోచించకుండా అజ్ఞానంగా సాగడమే
కనీసం మీ వారికోసమైనా మారండి జీవితాన్ని విశ్వంలో చూసుకోండి
No comments:
Post a Comment