విశ్వ లోకమున సూర్యోదయ కిరణాలు ఏ గ్రహాలపై
ఏ విధంగా ఏ క్షణాలలో ప్రకాశిస్తాయో ఎవరైనా తిలకించారా
మనకు సూర్యోదయం ఉదయమైతే గ్రహాలకు సూర్యోదయం వేరే క్షణాలలో
ఏ గ్రహంపై ఎప్పుడు సూర్య కిరణాలు పడుతాయో ఆ క్షణాలు అద్భుతం అద్వితీయం
విశ్వంలో ప్రతి రోజు ప్రతి క్షణం సూర్య కిరణాలను తిలకిస్తుంటే ఆ భావాలు విశ్వనీయమే
ఏ మేధస్సుకు తెలియని అపార విజ్ఞాన భావాలు విశ్వ లోకంలో కలుగుతూనే ఉంటాయి
నా మేధస్సును విశ్వాన్ని తిలకించేలా విశ్వ లోకంలోనే మహా భావనతో నిలిపాను
మీలో విశ్వ విజ్ఞాన భావాలు కలగాలంటే ఆకాశాన్ని దివ్యత్వంతో తిలకిస్తూ జీవించండి
No comments:
Post a Comment