నేడు నా భావాలు మరో దేశానికి (జపాన్) వెళ్ళిపోయాయి
భూ జల ప్రళయాలకు నా భావాలను కలచి వేస్తున్నాయి
పక్షుల భావ స్వభావాలతో ఘోరాన్ని తిలకిస్తూనే ఉన్నా
వేల ప్రాణాలు కోల్పోయిన మానవుల శ్వాస నాలో చేరుతున్నది
వారి జీవిత చరిత్రలు నా మేధస్సులో లిఖించబడుతున్నాయి
ఎన్నో జీవరాసులు నా విధికర భావాలతో శ్వాసను వదిలేస్తున్నాయి
ప్రతి జీవి మేధస్సులో కలిగే ఆవేదనలు ఆనాటి విశ్వ స్థితుల వేద భావాలే
మీలో దివ్య భావాలు ఉంటే విశ్వ ప్రళయాలు శాంతి యుతం కావడానికి ప్రయానింపజేయండి
కాల ప్రభావాలు దీనికి భిన్నంగా మళ్ళీ సంభవిస్తాయని భవిష్య విశ్వ సందేశం (హెచ్చరిక)
అలసిపోయిన విశ్వ గోళం అలజడులతో భూ జల వాయు అగ్ని ప్రళయాలను సృష్టించుకుంటున్నది
No comments:
Post a Comment