Friday, March 18, 2011

నేను జీవించే విధానము సరైనది

నేను జీవించే విధానము సరైనది కాదేమో
నాలోని భావాలను కాలమైనా మార్చదేమో
నా ఆలోచనలు మారలేకపోతున్నాయేమో
నా మేధస్సు విధానమే నా స్థానాన్ని మార్చలేక
నా జీవిత విధానము మారలేక పోతున్నది
నా ఆలోచన విధానములో మహా భావాలున్నాయి
నా మహా భావాలకు సరైన స్థానము లేదు
విశ్వ విజ్ఞానం ఉన్నా విశ్వ స్థానం ఎక్కడో తెలియదు
జీవించుటలో స్థానం లేకున్నా ఆలోచనలలో మహా భావాలే
భావాలతో ఆధ్యాత్మ విశ్వ స్థానాన్ని మేధస్సుననే కలిగి ఉన్నాను

No comments:

Post a Comment