ప్రతి రోజు ఉదయ సాయంత్రం జాతరకు వెళ్లి వస్తున్నారా
అసంఖ్యాక మానవులు మహా పరిశ్రమలలో పని చేసే వేళలివి
ఎప్పుడూ సమాజం రద్దీగా ఏదో ఒక సమస్యతో ఊరేగింపులతో కనిపిస్తున్నది
ఎవరు ఏపని చేస్తున్నారో ఎవరికి ఏది అవసరమో తెలియని పరిస్థితి
అందరికి ఆర్థికంగా అవసరాలున్నాయి ఇబ్బందులున్నాయి
మరి కొందరు లేనిపోనివి ఎన్నెన్నో ఎక్కడెక్కడో సృష్టిస్తున్నారు
అసంఖ్యాక జీవ పరిణామాలలో క్రమ బద్ధమైన ప్రణాళిక లేదు
అందరికి అన్ని విధాల ఉన్నవాడికి లేనివాడికి సమస్యలున్నాయి
అన్ని సమస్యలకు ఓ మహా ప్రణాళికను ఎవరైనా ఆలోచించారా
అన్ని సమస్యలకు పరిష్కారం నాలో మహా విశ్వ ప్రణాళిక ఉన్నది
No comments:
Post a Comment