విశ్వమున ఎక్కడైనా భగవంతులు ఇంకా జీవిస్తుంటే నాతో విజ్ఞానాన్ని చర్చించగలరా
విశ్వాన్ని ఇంకా ఏ విధంగా మార్పు చేయాలి ఏ విశ్వ కార్యాలను కొన సాగించాలి
ప్రస్తుతం జరుగుతున్న కార్యాలన్నీ సక్రమమైనవిగానే సాగుతున్నాయా
మరి నాకెందుకు అజ్ఞాన విజ్ఞాన భావాలు వివిధ రకాలుగా కనిపిస్తున్నాయి
అశుభ్రత ప్రాంతాలకు నన్ను వెళ్ళనీయకుండా మేధస్సును ఆలోచింపక చేస్తున్నాయి
వివిధ నిర్మాణాలు ప్రకృతిని వినాశనం చేసేలా ఆకాశం కనిపించని విధంగా ఉన్నాయి
సూర్యోదయ సూర్యాస్తములను ప్రతి రోజు చూసేవారు విశ్వమున ఎవరు లేరు
నాలోనైనా మీలోనైనా మహా విశ్వ విజ్ఞానం ఉంటే మరో విశ్వ కార్యాలను చర్చించుకుందాము
No comments:
Post a Comment