నేను మరణించిన తర్వాత నా దేహాన్ని నిర్మల ప్రాంతమున పూడ్చి పెట్టండి
నా సమాధి చుట్టూ ఏ విధమైన కృత్రిమ రూపాలు కట్టడాలు ఉండకూడదు
సూక్ష్మమైన కృతిమ రూపాలు కూడా ఉండకూడదు చాలా జాగ్రత్త వహించండి
మనిషి నాటిన చెట్టు కూడా అక్కడ ఉండకూడదనే నేను తెలుపుతున్నాను
ఏ విధమైన త్రవ్వకాలు అక్కడ జరగరాదు ఆ ప్రాంతాన్ని అశుభ్రత చేయరాదు
ప్రాంతమంతా సహజమైన ప్రకృతిగా ఆకాశపు అంచులు మాత్రమే కనిపించాలి
ప్రహరి గోడ కూడా ఆ ప్రాంతాన నిర్మించరాదు ఒక వేళ నిర్మిస్తే సమాధి నుండి కనిపించరాదు -
ప్రాంతమంతా సూర్యోదయ సూర్యాస్తములు దివ్యంగా కనిపించేలా ఉండాలి
ఈ విధంగా ఉంటే విశ్వమున స్వచ్ఛత మహా భావాలతో ఉదయిస్తూనే ఉంటుంది
నా సమాధిని ఎవరూ దర్శించరాదు ఒక వేళ దర్శిస్తే అపవిత్రమవుతుంది
దర్శించాలనుకుంటే సమాధి నుండి చూస్తే కనిపించనంత దూరాన ఉండాలి (పాద రక్షకములు లేకుండా) -
నా దేహాన్ని పూడ్చి పెట్టేటప్పుడు ఆ ప్రాంతాన్ని పాద రక్షకములు తాకకుండా చూడండి (త్రవ్వేటప్పుడు కూడా) -
పూడ్చిన తర్వాత కూడా సమాధిపై ఏవి చల్లరాదు ఉంచరాదు పవిత్రమైన నీరు తప్ప -
జగతికి మహా భావాల ఆలోచనలు కలగాలంటే నా దేహాన్ని ఇలా ఉంచాలి -
ఇలా జరగకున్నను విశ్వమున నా స్థానం ఇలాగే దివ్య పవిత్రతతో ఉంటుంది -
నేనెప్పుడూ విశ్వమునే ఆలోచిస్తాను ఆకాశాన్నే చూస్తాను జీవుల శ్వాసలో ఉంటాను -
No comments:
Post a Comment