బ్రంహా ముహూర్తాన విశ్వ ప్రయాణము చేస్తున్నా
విశ్వ ప్రయాణమున నక్షత్ర వెలుగులు విరజిమ్ముతున్నాయి
చీకటి తెలియని విధంగా దూరాన మెరిసే నక్షత్ర గమ్యానికై
ప్రయాణము ఒంటరిగా అడుగులతో సాగుతూనే ఉన్నది
ఏదో ఒక దానిని అందుకోవాలని సాగిపోతూనే ఉన్నాను
సూక్ష్మ వెలుగుతో నక్షత్రం కనిపిస్తున్నా ప్రయాణిస్తూనే ఉన్నా
సూక్ష్మ నక్షత్రాన్ని చేరుకున్న తర్వాత నేను నేనుగా శూన్యమైపోయా
No comments:
Post a Comment